-
-
Home » Andhra Pradesh » Queue for Kovaggin vaccine
-
కొవాగ్జిన్ టీకా కోసం క్యూ!
ABN , First Publish Date - 2020-12-28T07:50:23+05:30 IST
కరోనా కొత్త స్ర్టెయిన్ గుంటూరు జిల్లాలో అలజడి సృష్టిస్తోంది. గుంటూరులో కొవాగ్జిన్ టీకా కోసం జనం పోటెత్తుతున్నారు.

- కొత్త ‘స్ర్టెయిన్’ భయంతో క్లినికల్ ట్రయల్స్‌కు
- గుంటూరు ఐడీహెచ్‌లో 950 మందికి వ్యాక్సిన్
గుంటూరు(మెడికల్), డిసెంబరు 27: కరోనా కొత్త స్ర్టెయిన్ గుంటూరు జిల్లాలో అలజడి సృష్టిస్తోంది. గుంటూరులో కొవాగ్జిన్ టీకా కోసం జనం పోటెత్తుతున్నారు. మూడు రోజులుగా వందల సంఖ్యలో ప్రజలు వలంటీర్లుగా పేర్లు నమోదు చేయించుకొనేందుకు ఫీవర్ ఆస్పత్రికి క్యూ కట్టారు. గతవారం వరకు 650మంది మాత్రమే నమోదయ్యారు. అయితే బ్రిటన్ నుంచి 255 మంది జిల్లాకు వచ్చారని తెలియడంతో మూడు రోజులుగా వలంటీర్లుగా పేరు నమోదు చేసుకుని వ్యాక్సిన్ పొందేందుకు జనం పెద్దసంఖ్యలో వస్తున్నారు. ఈ నాలుగైదు రోజుల్లో సుమారు 300మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్పటివరకు 949మందికి వ్యాక్సిన్ ఇవ్వగా సోమవారానికి ఈ సంఖ్య వెయ్యి దాటే అవకాశం ఉంది.