శ్రీకాకుళం జిల్లా: క్వారంటైన్ కేంద్రంలో దెయ్యం కలకలం

ABN , First Publish Date - 2020-05-18T18:00:59+05:30 IST

సంతబొమ్మాళి క్వారంటైన్ కేంద్రంలో దెయ్యం కలకలం రేగింది.

శ్రీకాకుళం జిల్లా: క్వారంటైన్ కేంద్రంలో దెయ్యం కలకలం

శ్రీకాకుళం జిల్లా: సంతబొమ్మాళి క్వారంటైన్ కేంద్రంలో దెయ్యం కలకలం రేగింది. ఉన్నత పాఠశాలలో విశాఖ, గుంటూరు, నెల్లూరు నుంచి వచ్చిన 45 మంది వలస కార్మికులను క్వారంటైన్‌లో ఉంచారు. అయితే ఈ పునరావాస కేంద్రంలో ఉంటున్న ఓ వ్యక్తి దెయ్యం పట్టినట్లుగా నానా హంగామా చేశాడు. ఈ సంఘటనతో అక్కడ ఉన్నవారంతా భయంతో క్వారంటైన్ కేంద్రం నుంచి బయటకు పరుగులు తీశారు.


కొందరు ధైర్యం చేసి ఆ వ్యక్తిని తీసుకుని సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి తీసుకువెళ్లి పూజలు చేశారు. అప్పటికీ ఆ వ్యక్తిలో మార్పు రాకపోవడంతో జుట్టుపట్టుకుని చీపురుతో చితక్కొట్టారు. దీంతో ఆ వ్యక్తి దెయ్యం వదిలినట్టు కిందపడిపోయాడు. పోలీసులు, అధికారులు క్వారంటైన్ కేంద్రానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. ఇంటికి వెళ్లేందుకు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారంటూ అధికారులు కొట్టిపారేశారు.

Updated Date - 2020-05-18T18:00:59+05:30 IST