క్వారంటైన్ సెంటర్లో వసతుల్లేవ్: జనసేన నేత

ABN , First Publish Date - 2020-04-25T21:18:49+05:30 IST

గన్నవరం క్వారంటైన్ సెంటర్‌లో వసతులు సరిగా లేవని అక్కడివారు ఆవేదన చెందుతున్నారని జనసేన అధికార ప్రతిధిని వెంకట మహేష్ అన్నారు. ఆహారంలో నాణ్యత పారిశుద్ధ్యం అధ్వానంగా

క్వారంటైన్ సెంటర్లో వసతుల్లేవ్: జనసేన నేత

విజయవాడ: గన్నవరం క్వారంటైన్ సెంటర్‌లో వసతులు సరిగా లేవని అక్కడివారు ఆవేదన చెందుతున్నారని జనసేన అధికార ప్రతిధిని వెంకట మహేష్ అన్నారు. ఆహారంలో నాణ్యత పారిశుద్ధ్యం అధ్వానంగా ఉన్నాయని కరోనా బాధితులు కన్నీరు పెడుతున్నారని పేర్కొన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. క్వారంటైన్ సెంటరా..? లేక మానసిక హింస కేంద్రమా? అని ప్రశ్నించారు. 24 గంటల్లో గన్నవరం క్వారంటైన్ సెంటర్లో వసతులు మెరుగు పరచాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కరోనా వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సామాజిక వ్యాప్తి పెరుగుతున్నా చర్యలు చేపట్టడం లేదని ధ్వజమెత్తారు. ర్యాపిడ్ కిట్ల ద్వారా అత్యధిక పరీక్షలు చేశామని గొప్పులు చెప్పుకుంటున్నారే తప్ప.. వైరస్ కట్టడికి చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాజకీయాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు అని హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ కింద వేల కోట్ల రూపాయలుు ప్రభుత్వం నుంచి పొందే ప్రైవేటు ఆస్పత్రులు కరోనా బాధితులకు వైద్య సేవలు అందించాలని మహేష్ డిమాండ్ చేశారు.

Updated Date - 2020-04-25T21:18:49+05:30 IST