పుటపర్తిలో కనిపించని విదేశీయులు

ABN , First Publish Date - 2020-03-18T09:13:07+05:30 IST

పర్యాటక రంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. అనంతపురం జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రం లేపాక్షి ఆలయంతో పాటు నంది విగ్రహం, శిల్పకళాక్షేత్రం వీక్షించేందుకు ఈనెల 31వరకు అనుమతిని

పుటపర్తిలో కనిపించని విదేశీయులు

  • బోసిపోయిన ‘అనంత’ పర్యాటకం

అనంతపురం, మార్చి17 (ఆంధ్రజ్యోతి): పర్యాటక రంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. అనంతపురం జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రం లేపాక్షి  ఆలయంతో పాటు నంది విగ్రహం, శిల్పకళాక్షేత్రం వీక్షించేందుకు ఈనెల 31వరకు అనుమతిని రద్దుచేస్తూ ఆలయ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తికి విదేశీయుల రాక పూర్తిగా తగ్గిపోయింది. నెలరోజల వ్యవధిలో విదేశాల నుంచి కేవలం 9మంది మాత్రమే ఇక్కడికి వచ్చారు. ఏడాది పొడవునా దాదాపు 10వేల మంది విదేశీ భక్తులు పుట్టపర్తి వస్తుంటారు. ప్రస్తుతం ఇక్కడ వీరి సంఖ్య ఆరేడు వందలు మాత్రమే. వారంతా లాడ్జిలు, కాటేజీలకే పరిమితమయ్యారు. సత్యసాయి బాబా సమాధిని తాకకూడదని ట్రస్టు సభ్యులు ఆంక్షలు విధించారు. శని, మంగళవారాల్లో వేలాదిమంది దర్శించుకొనే కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి.

Updated Date - 2020-03-18T09:13:07+05:30 IST