పులిచింతల ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్
ABN , First Publish Date - 2020-08-23T00:04:07+05:30 IST
కృష్ణానది ఉధృతంగా ప్రవహరిస్తున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పులిచింతల ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం వరద పరిస్థితిని సమీక్షించారు. వరద ఉధృతి మరింత
విజయవాడ: కృష్ణానది ఉధృతంగా ప్రవహరిస్తున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పులిచింతల ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం వరద పరిస్థితిని సమీక్షించారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని, నదీ పరివాహక ప్రాంతాల తహసీల్దార్లను అప్రమత్తం చేసిన కలెక్టర్.. వారికి పలు సూచనలు చేశారు. నాగార్జున సాగర్ నుండి ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయానికి 4 లక్షల క్యూసెక్కుల నీరు పులిచింతలకు చేరే అవకాశం ఉందన్నారు. వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో వాటర్ లెవల్స్ నిర్వహణలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.