గుట్ట చదును పనులను అడ్డుకున్న గ్రామస్తులు

ABN , First Publish Date - 2020-06-19T21:45:24+05:30 IST

జిల్లాలోని పాకాల మండలం, పులివర్తివారిపల్లెలో ఇంటి స్థలాల కోసం గుట్ట(మేత బీడు)ను చదును చేస్తున్న రెవెన్యూ అధికారులను గ్రామస్తులుు అడ్డగించారు. బీడు, ప్రభుత్వ భూములను వదిలేసి, కోట్లాది

గుట్ట చదును పనులను అడ్డుకున్న గ్రామస్తులు

తిరుపతి: జిల్లాలోని పాకాల మండలం, పులివర్తివారిపల్లెలో ఇంటి స్థలాల కోసం గుట్ట(మేత బీడు)ను చదును చేస్తున్న రెవెన్యూ అధికారులను గ్రామస్తులుు అడ్డగించారు. బీడు, ప్రభుత్వ భూములను వదిలేసి, కోట్లాది రూపాయల ఖర్చుతో గుట్టను చదును చేయడం ఏంటని అధికారులను గ్రామస్తులు నిలదీశారు. గుట్టను చదును చేస్తే తమ ఊరిలోని పశువులను ఎలా పోషించుకోవాలంటూ ప్రశ్నించారు. గ్రామస్తులు గుట్ట చదును పనులను అడ్డుకోవడంతో రెవెన్యూ అధికారులు వెనుదిరిగి వెళ్లారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని స్వగ్రామం కావడంతోనే వైసీపీ నేతలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-06-19T21:45:24+05:30 IST