గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు గుజరాత్ నుంచి విశాఖకు ప్రత్యేక బృందం

ABN , First Publish Date - 2020-05-08T10:55:49+05:30 IST

విశాఖపట్టణానికి గుజరాత్ నుంచి ప్రత్యేక నిపుణుల బృందం ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానంలో గురువారం రాత్రి వచ్చింది....

గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు గుజరాత్ నుంచి విశాఖకు ప్రత్యేక బృందం

విశాఖపట్టణం : విశాఖపట్టణానికి గుజరాత్ నుంచి ప్రత్యేక నిపుణుల బృందం ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానంలో గురువారం రాత్రి వచ్చింది. విశాఖపట్టణంలోని ఎల్ జి పాలిమర్స్ లో గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు గుజరాత్ నుంచి ప్రత్యేకంగా ఎయిర్ ఇండియా కార్గో విమానంలో పారా టెర్షియరీ బ్యుటైల్ కెటెహాల్ (పీటీబీసీ)తోపాటు 9 మంది నిపుణుల ప్రత్యేక బృందాన్ని గురువారం రాత్రి విశాఖపట్టణానికి రప్పించారు. స్టెరిన్ గ్యాస్ లీకేజీని తటస్థం చేసే పీటీబీసీ కెమికల్ తో ప్రత్యేక బృందం గుజరాత్ నుంచి విశాఖకు వచ్చిందని విమానాశ్రయం డైరెక్టరు రాజ్ కిషోర్ చెప్పారు. గుజరాత్ రాష్ట్రంలోని వల్సాద్ జిల్లా వాపి పట్టణంలో తయారైన ఈ కెమికల్ గ్యాస్ లీకేజీ విస్తరించకుండా నివారించనుంది. విశాఖలోని ఎల్ జి పాలిమర్స్ లో గ్యాస్ లీకైన ఘటన జరిగిన నేపథ్యంలో గుజరాత్ నుంచి పీటీబీసీ కెమికల్ ను పంపించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుజరాత్ సీఎం విజయ్ రూపానీని అభ్యర్థించారు. దీంతో గుజరాత్ సీఎం ఆదేశంతో గ్యాస్ లీకేజీని తటస్థం చేసే పీటీబీసీ కెమికల్ తో పాటు 9 మంది నిపుణులైన ప్రత్యేక బృందం విశాఖపట్టణానికి వచ్చింది. 


Updated Date - 2020-05-08T10:55:49+05:30 IST