టీడీఆర్‌ బాండ్ల వివరాలు తెలపండి

ABN , First Publish Date - 2020-10-24T08:18:37+05:30 IST

ప్రజోపయోగ కార్యక్రమాలకు అవసరమైన ఆస్తులను సేకరించే సమయంలో బాధిత యజమానులకు ప్రభు త్వం జారీ చేసే టీడీఆర్‌(ట్రాన్స్‌ఫరబుల్‌ డెవల్‌పమెంట్‌ రైట్స్‌)

టీడీఆర్‌ బాండ్ల వివరాలు తెలపండి

 ఏఎంఆర్డీఏ

అమరావతి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ప్రజోపయోగ కార్యక్రమాలకు అవసరమైన ఆస్తులను సేకరించే సమయంలో బాధిత యజమానులకు ప్రభు త్వం జారీ చేసే టీడీఆర్‌(ట్రాన్స్‌ఫరబుల్‌ డెవల్‌పమెంట్‌ రైట్స్‌) బాండ్లను వినియోగించుకున్న వారు వివరాలను తెలియజేయాల్సిందిగా ఏఎంఆర్డీఏ కోరుతోంది.


స్థిరాస్తి వ్యవహారాల్లో ఎంతో ఉపయుక్తమైన ఈ బాండ్ల వినియోగంలో రాష్ట్రవ్యాప్తంగా పలు అక్రమాలు, లోపాయికారీ వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణల దృష్ట్యా.. ఇటీవలే పురపాలక శాఖ వీటికి సంబంధించిన లావాదేవీలను ఇకపై పూర్తిగా ఆన్‌లైన్‌లోనే సాగించాలని ఆదేశించింది.టీడీఆర్‌ బాండ్లను పొందిన అందరూ వాటి అసలు ప్రతులను తీసుకుని, ఈ నెల 28లోగా విజయవాడలోని తన ప్రధాన కార్యాలయం, గుంటూరులోని జోనల్‌ కార్యాలయాలకు రావాల్సిందిగా సూచిస్తోంది.  


Updated Date - 2020-10-24T08:18:37+05:30 IST