వైసీపీ ఎంపీలుగా ప్రజల్లో తిరగడానికి గర్వపడుతున్నాం: కోటగిరి శ్రీధర్
ABN , First Publish Date - 2020-09-20T21:40:48+05:30 IST
వైసీపీ ఎంపీలుగా ప్రజల్లో తిరగడానికి గర్వపడుతున్నారని ఎంపీ కోటగిరి శ్రీధర్ చెప్పారు. టీడీపీ ఖాళీ అయిపోతుందని మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, భూ కుంభకోణాలపై

ఢిల్లీ: వైసీపీ ఎంపీలుగా ప్రజల్లో తిరగడానికి గర్వపడుతున్నారని ఎంపీ కోటగిరి శ్రీధర్ చెప్పారు. టీడీపీ ఖాళీ అయిపోతుందని మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, భూ కుంభకోణాలపై సీబీఐ విచారణ జరపాలని కేంద్రాన్ని కోరుతామని తెలిపారు. హిందువులు బీజేపీలోనే కాదు.. వైసీపీలోనూ ఉన్నారని స్పష్టం చేశారు. ఎంపీ రఘురామకృష్ణరాజును అమాయకుడిని చేసి.. టీడీపీ వాళ్ల వైపు తీసుకెళ్లిందని కోటగిరి శ్రీధర్ విమర్శించారు.