నిరసన బాటలో ఎస్వీ మెడికల్ కళాశాల వైద్యులు
ABN , First Publish Date - 2020-08-22T21:34:37+05:30 IST
వైద్య విద్యా వైద్యులు నిరసన బాట పట్టారు. తమ వేతనాలను పెంచాలంటూ నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవ్వాలని వైద్యులు నిర్ణయించారు. 14 సంవత్సరాలుగా తమకు జీతాలు పెంచడం లేదని,
తిరుపతి : వైద్య విద్యా వైద్యులు నిరసన బాట పట్టారు. తమ వేతనాలను పెంచాలంటూ నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవ్వాలని వైద్యులు నిర్ణయించారు. 14 సంవత్సరాలుగా తమకు జీతాలు పెంచడం లేదని, ఇప్పుడైనా పెంచాలని డిమాండ్ చేశారు. కోవిడ్ రోగులకు వైద్యం అందిస్తూ మృతి చెందిన వైద్యులకు కేంద్రం ఇచ్చే రూ.50 లక్షలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.50 లక్షలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా తమ డిమాండ్లను పరిష్కరించకపోతే నిరసనను తీవ్రతరం చేస్తామని వైద్యులు హెచ్చరించారు. ఈ మేరకు ఎస్వీ మెడికల్ కళాశాలలోని ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రకటన విడుదల చేసింది.