ఏపీలో భగ్గుమన్న నిరసనలు

ABN , First Publish Date - 2020-08-01T23:27:44+05:30 IST

మూడు రాజధానుల వ్యతిరేకంగా ఏపీలో నిరసనలు భగ్గుమంటున్నాయి. సీఆర్డీఏ రద్దును నిరసిస్తూ పోరుబాట పట్టారు ప్రజలు. టీడీపీతో..

ఏపీలో భగ్గుమన్న నిరసనలు

అమరావతి: మూడు రాజధానుల వ్యతిరేకంగా ఏపీలో నిరసనలు భగ్గుమంటున్నాయి. సీఆర్డీఏ రద్దును నిరసిస్తూ పోరుబాట పట్టారు ప్రజలు. టీడీపీతో పాటు పలు పార్టీల నేతలు ఈ అందోళనలో పాల్గొన్నారు. విపక్షాలకు చెందిన కార్యకర్తలు, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డుపై నిల్చుని నిరసన తెలుపుతున్నారు. ఓ వైపు అమరావతిలో వేల ఎకరాల భూములిచ్చిన రైతాంగానికి మద్దతుగా మిగతా జిల్లాల వాసులు నిరసనకు దిగారు. |


పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో కాటన్ విగ్రహం వద్ద అమరావతి రాజధాని రైతులకు మద్దతుగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిరసన తెలిపారు. అయితే కాటన్ విగ్రహం వద్దకు వెళ్తున్న సమయంలో రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో రైతులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అదే సమయంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. దీంతో పీఎస్ ఎదుటే ఆందోళనకారులు ధర్నాకు దిగారు. 

Updated Date - 2020-08-01T23:27:44+05:30 IST