గిరిజన ప్రయోజనాలు కాపాడుదాం: సీఎం

ABN , First Publish Date - 2020-05-11T10:33:43+05:30 IST

గిరిజన ప్రయోజనాలు కాపాడుదాం: సీఎం

గిరిజన ప్రయోజనాలు కాపాడుదాం: సీఎం

అమరావతి, మే 10(ఆంధ్రజ్యోతి): మన్యం ప్రాంత పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులన్నీ గిరిజనులతోనే భర్తీచేసే ప్రభుత్వ ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై సీఎం జగన్‌ సమీక్షించారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులను పూర్తిగా ఎస్టీ అభ్యర్థులతో భర్తీ చేసేలా ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవో 3ను సుప్రీంకోర్టు కొట్టి వేయడాన్ని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, ఇతర గిరిజన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. గిరిజనుల ప్రయోజనాలు కాపాడుదామని, ఇందుకోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో దృష్టి సారించాలని అడ్వొకేట్‌ జనరల్‌ను సీఎం ఆదేశించారు. 

Updated Date - 2020-05-11T10:33:43+05:30 IST