ఆస్తి పన్ను పెంపు 10-15 శాతమే: బొత్స
ABN , First Publish Date - 2020-11-26T10:19:31+05:30 IST
కేంద్ర ప్రభుత్వ సూచనల మేర కే ఆస్తి పన్నుపై విధానపరమైన నిర్ణయం తీసుకున్నామని పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ సూచనల మేర కే ఆస్తి పన్నుపై విధానపరమైన నిర్ణయం తీసుకున్నామని పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ నిర్ణయంతో 10 నుంచి 15 శాతమే పన్ను పెరుగుతుందని చెప్పారు. బుధవారం మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల్లో సుపరిపాలన లక్ష్యంతోనే సీఎం జగన్ ఇంటి పన్నుపై నిర్ణ యం తీసుకున్నారని తెలిపారు. గతంలో నెలకు వెయ్యి రూపాయల అద్దె వ స్తే.. మూడు వేలను ఇంటి పన్నుగా వేసేవారని.. ఇప్పుడు ఆస్తి విలువ మీద పన్ను వేయాలని నిర్ణయంచామనిన్నారు. ఇతర రాష్ట్రాలూ ఇదే విధానం అవలంబిస్తున్నాయని చెప్పారు. వివిధ సంఘాలు తమను కలసి 25 శాతం పెంచినా పర్వాలేదని చెప్పాయన్నారు. 375 చదరపు అడుగుల వరకూ ఆస్తి పన్ను రూ.50 మాత్రమేనని వెల్లడించారు.