సగం జీతాలతో తీవ్ర ఇబ్బందులు..
ABN , First Publish Date - 2020-04-08T18:05:30+05:30 IST
ఆర్థిక నష్టాల్లో ఉన్న ఏపీఎస్ ఆర్టీసీపై కరోనా ప్రభావం

అమరావతి: ఆర్థిక నష్టాల్లో ఉన్న ఏపీఎస్ ఆర్టీసీపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. తమ సర్వీసులో ఇలాంటి దుస్థితి ఎప్పుడూ చూడలేదని కార్మిక, ఉద్యోగులు చెబుతున్నారు. లాక్ డౌన్ మరిన్ని రోజులు పొడిగిస్తే సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సగం జీతాలతో అవస్థలు పడుతున్న తమకు భవిష్యత్తుపై భయం పట్టుకుందని వాపోతున్నారు.