-
-
Home » Andhra Pradesh » private travels AP
-
ఏపీ ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాల కీలక నిర్ణయం
ABN , First Publish Date - 2020-05-13T14:22:58+05:30 IST
ఏపీ ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాల కీలక నిర్ణయం

అమరావతి: రాష్ట్రంలో బస్సులు నడిపే అంశంపై ఏపీ ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. జూన్ నెలాఖరు వరకు బస్సులు నడపబోమని రవాణా శాఖకు దరఖాస్తు చేసుకున్నాయి. దీంతో త్రైమాసిక పన్ను నుంచి మినహా ఇంపు పొందాయి. వివిధ ట్రావెల్స్‌కు చెందిన దాదాపు 800 బస్సుల యజమానులు రవాణా శాఖకు దరఖాస్తు చేసుకుని పన్ను మినహాయింపు పొందాయి. రాష్ట్రంలోని 800 ప్రైవేటు బస్సులకు గాను 400 బస్సుల యాజామాన్యాలు బస్సులు నడపబోమని తాజాగా దరఖాస్తు చేసుకున్నాయి.
రవాణా వాహనాలను మూడు నెలలపాటు నడపకూడదని భావిస్తే త్రైమాసిక పన్ను నుంచి వాటికి ఉపశమనం లభిస్తుంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పన్ను మినహాయింపు కావాలంటే మార్చిలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లాక్‌డౌన్ కారణంగా ప్రజారవాణా ఆగిపోవడంతో మార్చిలోనే ఆయా బస్సుల యాజమాన్యాలు బస్సులు నడపబోమంటూ రవాణా శాఖకు దరఖాస్తు చేసుకున్నాయి. తాజాగా మరో 400కు పైగా బస్సుల యాజమాన్యాలు జూన్ నెలాఖరు వరకు బస్సులు నడపబోమని దరఖాస్తు చేసుకుని త్రైమాసిక పన్ను నుంచి మినహాయింపు పొందాయి.