మరిన్ని ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలు!

ABN , First Publish Date - 2020-07-15T09:21:51+05:30 IST

2020-21 విద్యా సంవత్సరంలో 371 మండలాలు, 100 మున్సిపాలిటీలలో కొత్త ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల ఏర్పాటుకు ఇంటర్‌ ...

మరిన్ని ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలు!

ఆగస్టు 17 వరకు దరఖాస్తుల స్వీకరణ

అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): 2020-21 విద్యా సంవత్సరంలో 371 మండలాలు, 100 మున్సిపాలిటీలలో కొత్త ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల ఏర్పాటుకు ఇంటర్‌ బోర్డు రివైజ్డ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కరోనా నేపథ్యలో పదో తరగతి విద్యార్థులందరినీ పాస్‌ చేయడం, ఇంటర్‌లో ఒక్కో సెక్షన్‌కు 88 మంది నుంచి 40 మందికి విద్యార్థుల సంఖ్యను తగ్గించడం తదితర కారణాలతో కొత్త కాలేజీల సంఖ్యను పెంచాలని నిర్ణయించినట్లు బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. ఈ కాలేజీలు ఏర్పాటు చేయదలచుకున్న వారు ఆగస్టు 17లోగా దరఖాస్తులు సమర్పించాలని ఆయన కోరారు. 

Updated Date - 2020-07-15T09:21:51+05:30 IST