అర్చకులకు ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలి

ABN , First Publish Date - 2020-12-28T08:46:05+05:30 IST

దేవదాయ, ధర్మదాయశాఖలో పనిచేస్తున్న అర్చకులకు 65ఏ అమలుచేసి ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ అర్చక వేద పండితుల సంఘం అధ్యక్షుడు గొడవర్తి శ్రీనివాసు (అప్పనపల్లి వాసు) డిమాండ్‌ చేశారు.

అర్చకులకు ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలి

మామిడికుదురు, డిసెంబరు 27: దేవదాయ, ధర్మదాయశాఖలో పనిచేస్తున్న అర్చకులకు 65ఏ అమలుచేసి ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ అర్చక వేద పండితుల సంఘం అధ్యక్షుడు గొడవర్తి శ్రీనివాసు (అప్పనపల్లి వాసు) డిమాండ్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అప్పనపల్లిలో ఆదివారం జరిగిన సంఘ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు, గౌరవాధ్యక్షుడు శంకరమంచి శాంతిబాబు మాట్లాడుతూ 65ఏ అమలు చేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2వేల మందికి లబ్ధి చేకూరుతుందని, దీని కోసం పోరాటం ఉధృతం చేస్తామన్నారు.  

Updated Date - 2020-12-28T08:46:05+05:30 IST