నూతన రథానికి సన్నాహాలు

ABN , First Publish Date - 2020-09-13T07:42:33+05:30 IST

‘‘అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి నూతన రథం కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. రావులపాలెం టింబరు డిపోలో పాత టేకు

నూతన రథానికి సన్నాహాలు

  •  ఏడీసీ రామచంద్రమోహన్‌

అంతర్వేది, సెప్టెంబరు 12: ‘‘అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి నూతన రథం కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. రావులపాలెం టింబరు డిపోలో పాత టేకు కలపను మంత్రి వేణుతో కలిసి పరిశీలించాం. ఈ మేరకు సబ్‌కలెక్టర్‌, ఆర్జేసీ, డీసీ ఈఈ, ఏసీ, డీఎ్‌ఫవోలతో కమిటీ వేయనున్నాం’’ అని ఏడీసీ రామచంద్రమోహన్‌ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో రథం దగ్ధమైన ప్రాంతాన్ని సబ్‌కలెక్టర్‌, పోలీసు ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. సోమ, మంగళవారాల్లో కమిటీతో, రథం తయారుచేసే శిల్పితో మాటాడతామన్నారు. కమిటీ నిర్ణయం మేరకు దేవదాయశాఖ, ప్రభుత్వం ఆమోదం తీసుకొని స్వామివారి తీర్థ మహోత్సవాలకు ముందుగానే నూతన రథాన్ని సిద్ధం చేస్తామని తెలిపారు. దీనికోసం పరిశీలించిన కలపను ఆలయ ప్రాంగణంలో ఎక్కడ భద్రపరచాలనే దానిపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో ఆలయ ఏసీ భద్రాజీ, డిప్యూటీ తహశీల్దార్‌ భాస్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-09-13T07:42:33+05:30 IST