నాదెండ్ల ఎస్సీ కాలనీలో వైసీపీ దాడులకు పాల్పడింది: ప్రత్తిపాటి
ABN , First Publish Date - 2020-09-03T15:19:37+05:30 IST
గుంటూరు: నాదెండ్ల ఎస్సీ కాలనీలో వైసీపీ దాడులకు పాల్పడిందని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు వెల్లడించారు.

గుంటూరు: నాదెండ్ల ఎస్సీ కాలనీలో వైసీపీ దాడులకు పాల్పడిందని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. దుర్మార్గం, కావాలనే టీడీపీ శ్రేణుల ఇళ్ల ముందు బాణసంచా కాల్చారన్నారు. ఇళ్ల ముందు హేళనగా మాట్లాడి రెచ్చగొట్టారన్నారు. జగన్‌కు ప్రజలు 151 సీట్లు ఇచ్చింది అరాచకాలు చేయడానికి కాదన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ శ్రేణుల అరాచకాలు పెరిగిపోయాయన్నారు. ప్రభుత్వం ఈ దాడులను ఆపకపోతే ప్రజలే తిరిగబడే పరిస్థితి వస్తుందన్నారు.