అనుమానం రాకుండా కొబ్బరి పీచుల మధ్య దాచి..చివరకు..

ABN , First Publish Date - 2020-07-20T22:27:13+05:30 IST

జిల్లాలో మార్టూరు మండలం రాజుపాలెం చెక్ పోస్ట్ వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. కొబ్బరి పీచుల మధ్య లారీలో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

అనుమానం రాకుండా కొబ్బరి పీచుల మధ్య దాచి..చివరకు..

ప్రకాశం: జిల్లాలో మార్టూరు మండలం రాజుపాలెం చెక్ పోస్ట్ వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. కొబ్బరి పీచుల మధ్య  లారీలో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో వున్న మరో ముగ్గురి  కోసం గాలిస్తున్నారు. పట్టుబడ్డ నిందితుల నుంచి 585 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ రూ.30 లక్షలు  ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. లారీ తుని నుండి నెల్లూరు వెళ్తున్నట్లు పోలీసుల నిర్ధారించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

 

Updated Date - 2020-07-20T22:27:13+05:30 IST