ప్రకాశం జిల్లాలో తగ్గుతున్న కరోనా ఉధృతి..
ABN , First Publish Date - 2020-10-03T12:37:15+05:30 IST
ప్రకాశం జిల్లాలో కరోనా ఉధృతి కొంచెం తగ్గుముఖం పట్టింది.
ప్రకాశం: జిల్లాలో కరోనా ఉధృతి కొంచెం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 308 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు పాజిటీవ్ కేసులు 50,295కు చేరాయి. ఒంగోలులో నిన్న అత్యధికంగా 43 కేసులు నమోదు కాగా.. ఇద్దరు మృతిచెందారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య 494కు చేరింది. నిన్న కరోనా నుండి కోలుకుని 92 మంది డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లలో ప్రస్తుతం 6,660 యాక్టివ్ కేసులు ఉన్నాయి.