ప్రకాశం జిల్లాలో కరోనా విజృంభణ

ABN , First Publish Date - 2020-07-27T12:32:00+05:30 IST

ప్రకాశం జిల్లాలో కరోనా విజృంభణ

ప్రకాశం జిల్లాలో కరోనా విజృంభణ

ప్రకాశం: జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఒకే రోజు అత్యధికంగా 305 కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4204కు చేరింది. జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో దాదాపు 49మంది మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం 1,29,258 శ్యాంపిళ్లు పంపగా...అందులో 1,22,429 నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. ఇంకా 6829 రిపోర్టులు రావాల్సింది. జిల్లా వ్యాప్తంగా క్వారంటైన్లలో 260 మంది ఉన్నారు. నిన్న కరోనా నుండి కోలుకుని 49 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కరోనా బారి నుండి కోలుకుని 3242 మంది డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాలో ప్రస్తుతం 962 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

Updated Date - 2020-07-27T12:32:00+05:30 IST