ప్రకాశం జిల్లాలో నిలకడగా కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-05-24T14:00:47+05:30 IST

ప్రకాశం జిల్లాలో నిలకడగా కరోనా కేసులు

ప్రకాశం జిల్లాలో నిలకడగా కరోనా కేసులు

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి. జిల్లాలో మొత్తం 68 కేసులు నమోదు అయ్యాయి. కరోనా నుండి కోలుకుని నిన్న జీజీహెచ్ నుండి ఒకరు డిశ్చార్జ్ అయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం 26,819 శ్యాంపిళ్లు పంపగా.. 26,059 నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. అలాగే 692 మంది రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 936 మంది క్వారంటైన్లలో ఉన్నారు. ఇప్పటి వరకు కరోనా భారి నుండి కోలుకుని 64 మంది డిశ్చార్జ్ అవగా, జిల్లాలో ప్రస్తుతం నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2020-05-24T14:00:47+05:30 IST