ప్రకాశం జిల్లాలో మరో 327 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-09-14T13:05:58+05:30 IST
ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా మరో 327 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 37,420కు చేరింది. ఒంగోలులో అత్యధికంగా 61 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి ఇద్దరు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు 376 మంది మృతి చెందారు. నిన్న కరోనా నుండి కోలుకుని 81 మంది డిశ్చార్జ్ అయ్యారు. 87 మందిని హోం ఐసోలేషన్‌కు పంపారు. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లలో ప్రస్తుతం 14,379 యాక్టివ్ కేసులు ఉన్నాయి.