ప్రకాశం జిల్లాలో 16,099కు చేరిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-08-22T12:24:37+05:30 IST

ప్రకాశం జిల్లాలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. తాజాగా మరో 544 కేసులు నమోదు అవడంతో జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్

ప్రకాశం జిల్లాలో  16,099కు చేరిన కరోనా కేసులు

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. తాజాగా మరో 544 కేసులు నమోదు అవడంతో జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16,099కు చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి ఇద్దరు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో 210 మంది మృత్యువాతపడ్డారు. నిన్న కరోనా నుండి కోలుకుని 78 మంది డిశ్చార్జ్ అయ్యారు. 85 మందిని హోం ఐసోలేషన్‌కు తరలించారు. జిల్లాలో ప్రస్తుతం 1760 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

Updated Date - 2020-08-22T12:24:37+05:30 IST