అచ్చెన్నాయుడిని ఎలా డిశ్చార్జ్ చేయాలనుకున్నారు: బాలాజీ
ABN , First Publish Date - 2020-06-25T18:03:50+05:30 IST
అచ్చెన్నాయుడిని ఎలా డిశ్చార్జ్ చేయాలనుకున్నారు: బాలాజీ

ప్రకాశం: టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని హాస్పటల్‌లోనే విచారించాలని ఏసీబీ అధికారులకు కోర్టు ఉత్తర్వుల ఉన్నాయని టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నూకసాని బాలాజీ తెలిపారు. అయినా ఇంత దుర్మార్గంగా అర్ధరాత్రి హాస్పిటల్ నుండి ఎలా డిశ్చార్జ్ చేయాలని అనుకున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం, అధికారులు కోర్టులను కూడా లెక్క చేసే పరిస్థితుల్లో లేరని బాలాజీ విమర్శించారు.