ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల ధర్నా

ABN , First Publish Date - 2020-06-25T16:52:10+05:30 IST

ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల ధర్నా

ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల ధర్నా

ప్రకాశం: పొగాకుకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలంటూ కొండేపిలో పొగాకు రైతులు ధర్నాకు దిగారు. బ్యారన్‌కి ఆరు లక్షలు ఖర్చు అవుతుంటే, కనీసం మూడు లక్షలు కూడా గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. గిట్టు బాటు ధర కల్పించకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామంటూ టంగుటూరు రోడ్డుపై ట్రాక్టర్‌లు అడ్డంగా పెట్టి పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఆ రహదారిపై వెళ్తున్న తహసీల్దార్‌ను అడ్డుకుని తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2020-06-25T16:52:10+05:30 IST