ప్రకాశం జిల్లాలో భారీ చోరీ
ABN , First Publish Date - 2020-09-14T16:36:48+05:30 IST
ప్రకాశం జిల్లా ఒంగోలులోని మంగమూరు రోడ్డుల జీఎస్ఆర్ అపార్ట్‌మెంట్స్‌లో భారీ చోరీ జరిగింది.
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులోని మంగమూరు రోడ్డుల జీఎస్ఆర్ అపార్ట్‌మెంట్స్‌లో భారీ చోరీ జరిగింది. రాత్రి సమయంలో ఒకే అపార్ట్‌మెంట్లో రెండు ఫ్లాట్లలో దుండుగులు చోరీకి పాల్పడ్డారు. సుమారు 60 సవర్ల బంగారం, నాలుగు కిలోల వెండిని దుండుగలు అపహరించినట్లు బాధితులు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. క్లూస్ టీమ్స్‌తో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.