ప్రకాశం: ఎస్సై అత్యుత్సాహానికి యువకుడు బలి

ABN , First Publish Date - 2020-07-22T15:10:01+05:30 IST

ప్రకాశం: ఎస్సై అత్యుత్సాహానికి యువకుడు బలి

ప్రకాశం: ఎస్సై అత్యుత్సాహానికి యువకుడు బలి

ఒంగోలు: ఎస్సై అత్యుత్సాహానికి యువకుడి ప్రాణాలు బలైన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ఈనెల 19న మాస్క్ లేకుండా తిరుగుతున్నాడని కరణ్ కుమార్ అనే యువకుడిని  చీరాల టూటౌన్ ఎస్సై విజయ్ కుమార్ చితకబాదాడు. దీంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం గుంటూరుకు తరలించారు. కాగా యువకుడు కిరణ్‌కుమార్ పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. యువకుడి పట్ల ఎస్సై వ్యవహరించిన తీరుపై కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-07-22T15:10:01+05:30 IST