ప్రబోధానంద కన్నుమూత

ABN , First Publish Date - 2020-07-10T08:34:32+05:30 IST

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చిన్నపొలమడలోని ప్రబోధానంద ఆశ్రమం(శ్రీకృష్ణ మందిరం)

ప్రబోధానంద కన్నుమూత

  • ఆశ్రమం వద్ద భారీ బందోబస్తు
  • అంత్యక్రియలకు భక్తులు రావొద్దని విజ్ఞప్తి

తాడిపత్రి, జూలై 9: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చిన్నపొలమడలోని ప్రబోధానంద ఆశ్రమం(శ్రీకృష్ణ మందిరం) నిర్వాహకులు ప్రబోధానంద యోగీశ్వరులు(70) అలియాస్‌ గుత్తా పెద్దన్నచౌదరి ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఆశ్రమంలోనే కన్నుమూశారు. పెద్దపప్పూరు మండలం అమ్మలదిన్నె కొత్తపల్లికి చెందిన ఆయన ఆర్మీలో వైర్‌లెస్‌ ఆపరేటర్‌గా పనిచేశారు. కొంతకాలం ఆర్‌ఎంపీ వైద్యుడి సేవలందించారు. అనంతరం అధ్యాత్మిక చింతనతో ప్రబోధానంద యోగీశ్వరులుగా పేరు మార్చుకున్నారు. భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌లను కలిపి త్రైత సిద్ధాంతం పుస్తకం రాశారు. 2003లో తాడిపత్రికి వచ్చి చిన్నపొలమడ వద్ద ప్రబోధానంద ఆశ్రమాన్ని నిర్మించారు.


హిందూ, ముస్లిం దేవుళ్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు, రచనలు వివాదాస్పదమయ్యాయి. ప్రబోధానంద మృతితో భక్తులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ముందు జాగ్రత్తగా ఆశ్రమం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. కరోనా నేపథ్యంలో ఆశ్రమంలో జరిగే ప్రబోధానంద అంత్యక్రియలకు భక్తులు రావొద్దని డీఎస్పీ శ్రీనివాసులు, ప్రబోధానంద తనయుడు యోగానందస్వామి విజ్ఞప్తి చేశారు. అం త్యక్రియల చిత్రాలు, సీడీలను భక్తులకు తర్వాత అందజేస్తామని చెప్పారు.

Updated Date - 2020-07-10T08:34:32+05:30 IST