-
-
Home » Andhra Pradesh » PPA review on Polavaram today
-
పోలవరంపై నేడు పీపీఏ సమీక్ష
ABN , First Publish Date - 2020-12-30T08:47:08+05:30 IST
పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, సహాయ పునరావాసం, హెడ్‌వర్క్స్‌పై జల వనరుల శాఖతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ బుధవారం విజయవాడలో సమీక్ష జరుపనుంది.

అమరావతి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, సహాయ పునరావాసం, హెడ్‌వర్క్స్‌పై జల వనరుల శాఖతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ బుధవారం విజయవాడలో సమీక్ష జరుపనుంది. ఈ నెలలో పీపీఏ బృందాలు, సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ ప్రాజెక్టు క్షేత్రంలో, పునరావాస కాలనీల్లో పర్యటనలు జరిపి పనులను సమీక్షించిన సంగతి తెలిసిందే.
41.15 మీటర్ల కాంటూరు వరకూ భూసేకరణ జరిగినందున.. సహాయ పునరావాస కార్యక్రమాల పూర్తిపై దృష్టి సారించాలని బుదవారం నాటి సమావేశంలో అయ్యర్ ఆదేశించనున్నారు. కాగా, కృష్ణా న దీ యాజమాన్య బోర్డు వచ్చే నెల 12న సమావేశం కానుంది. ఈ నెలాఖరునాటికి కృష్ణా జలాల వినియోగం, వచ్చే మార్చికి కావలసిన జలాలు.. మే 31నాటికి అవసరమయ్యే నీటి అంచనాల వివరాలను వచ్చే నెల 8నాటికి పంపాలని ఈఎన్‌సీలకు బోర్డు సభ్య కార్యదర్శి రాజ్‌పురి లేఖ రాశారు.