మాకు హైకోర్టు జడ్జి అధికారాలు

ABN , First Publish Date - 2020-03-16T08:38:04+05:30 IST

కేంద్ర ప్రభుత్వం కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించిందని, దీనిపై కేంద్ర అధికారులతో చర్చించిన తర్వాతే స్థానిక ఎన్నికలు వాయిదా వేశామని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. జాతీయ విపత్తు ఆదేశాలను కేంద్రం ఉపసంహరించిన

మాకు హైకోర్టు జడ్జి అధికారాలు

  • ఎన్నికలు రద్దు చేయలేదు
  • నిలుపుదల మాత్రమే చేశాం
  • సీఎం వ్యాఖ్యలపై ఎస్‌ఈసీ స్పందన


కేంద్ర ప్రభుత్వం కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించిందని, దీనిపై కేంద్ర అధికారులతో చర్చించిన తర్వాతే స్థానిక ఎన్నికలు వాయిదా వేశామని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. జాతీయ విపత్తు ఆదేశాలను కేంద్రం ఉపసంహరించిన వెంటనే ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం ఎన్నికలను నిలుపుదల మాత్రమే చేశామని, రద్దు చేయలేదన్నారు. ఎన్నికల సమయంలో ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్ధమైన స్వతంత్ర వ్యవస్థ అని గుర్తు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషర్‌కు హైకోర్టు జడ్జికి ఉండే అధికారాలు ఉంటాయని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో హింసపై హైకోర్టులో వ్యాజ్యం నడుస్తోందని గుర్తు చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారికి దురుద్దేశాలు ఆపాదించడం తీవ్ర విచారకరమన్నారు. ఇటువంటి చర్యలు వ్యవస్థలను బలహీనపరుస్తాయని రమేశ్‌కుమార్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2020-03-16T08:38:04+05:30 IST