-
-
Home » Andhra Pradesh » Potti sriramulu vardhanthi
-
ఘనంగా పొట్టి శ్రీరాములు 68వ వర్ధంతి
ABN , First Publish Date - 2020-12-15T16:46:22+05:30 IST
విజయవాడలో పొట్టి శ్రీరాములు 68వ వర్ధంతి ఘనంగా జరిగింది.

విజయవాడ: నగరంలో పొట్టి శ్రీరాములు 68వ వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వన్‌టౌన్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విముక్తి కోసం పొట్టి శ్రీరాములు ప్రాణాలర్పించారని కొనియాడారు. అలాంటి వ్యక్తికి గౌరవం ఇచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి అని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అగౌరవపరిచింది చంద్రబాబు అయితే.. సీఎం జగన్ ఆ దినోత్సవాన్ని గౌరవించారని మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యానించారు.