-
-
Home » Andhra Pradesh » Pothula Mahesh Sensational Comments
-
ఆ మంత్రి రాష్ట్రానికి అరిష్టం, దరిద్రం: జనసేన నేత
ABN , First Publish Date - 2020-12-30T19:32:45+05:30 IST
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత పోతుల మహేష్ స్పందించారు.

అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత పోతుల మహేష్ స్పందించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెల్లంపల్లి అరిష్టం, దరిద్రం అని అన్నారు. మైలు పడ్డ మంత్రి అని, దేవాదాయశాఖ మంత్రిగా ఉండడానికి హిందూ సంప్రదాయప్రకారం అనర్హుడని అన్నారు. ఈ మాట చెప్పడానికి బాధగా ఉన్నా.. తప్పక చెబుతున్నానని అన్నారు.
వెల్లంపల్లి మంత్రిగా ప్రమాణం చేసిన రెండు, మూడు నెలలకు అతని తల్లి చనిపోయిందని.. ఏడాదిపాటు మైలు ఉంటుందని పోతుల మహేష్ అన్నారు. మళ్లీ ఆగస్టులో మంత్రి సొంత బాబాయి కాలం చేశారని.. దీంతో మరో ఏడాది మైలు ఉంటుందన్నారు. మైలుపడ్డ మంత్రిగా విధులు నిర్వహించకూడదని అన్నారు. అందుకే రాష్ట్రానికి అకాల వర్షాలు, పంటలు చేతికొచ్చే సమయానికి వరదలపాలవుతున్నాయని, రాష్ట్రం అభివృద్ధి చెందడంలేదని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన అల్లర్లు, అరాచకం పెరిగిపోయిందన్నారు. ఈ రాష్ట్రానికి అరిష్టం, దరిద్రం ఎవరంటే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అని పోతుల మహేష్ మరోసారి స్పష్టం చేశారు.