దుర్గ గుడి సీసీ టీవీ ఫుటేజ్‌ను బహిర్గతం చేయాలి: పోతిన మమేష్

ABN , First Publish Date - 2020-09-17T22:00:02+05:30 IST

విజయవాడ: అమ్మవారి వెండి రథంపై సింహాలు మాయంపై కొత్త విమర్శలు వినవస్తున్నాయి.

దుర్గ గుడి సీసీ టీవీ ఫుటేజ్‌ను బహిర్గతం చేయాలి: పోతిన మమేష్

విజయవాడ: అమ్మవారి వెండి రథంపై సింహాలు మాయంపై కొత్త విమర్శలు వినవస్తున్నాయి. దీనిపై జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ మాట్లాడుతూ.. పోయిన సింహాల స్థానంలో అమ్మవారి అంతరాలయం ముఖమండపంలో గల వెండి తాపడాలను తయారుచేసేందుకు తరలించారన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలన్నారు. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ను బహిర్గతం చేయాలన్నారు. మొదటిరోజు విచారణ చేసిన అధికారి రెండవ రోజు బ్రేక్ వేయడానికి గల కారణాలేమిటని ప్రశ్నించారు.  ఈవో తక్షణమే రాజీనామా చేయాలని పోతిన మహేష్ డిమాండ్ చేశారు.

Updated Date - 2020-09-17T22:00:02+05:30 IST