పాలీసెట్‌ వాయిదా.. దరఖాస్తు గడువు మే 15

ABN , First Publish Date - 2020-04-21T10:32:05+05:30 IST

2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(పాలీసెట్‌-2020)

పాలీసెట్‌ వాయిదా.. దరఖాస్తు గడువు మే 15

అమరావతి, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(పాలీసెట్‌-2020) వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 28న ఈ పరీక్ష జరగాలి. అయితే, లాక్‌డౌన్‌ నేపథ్యంలో దీనిని వాయిదా వేసినట్టు సమాచారం. కాగా, పాలీసెట్‌ దరఖాస్తు గడువును మే 15 వరకు పొడిగించారు. పరీక్ష  ఎప్పుడు నిర్వహించేదీ త్వరలో తెలియజేస్తారు.

Updated Date - 2020-04-21T10:32:05+05:30 IST