నేటి ఇంటర్‌ పరీక్ష వాయిదా

ABN , First Publish Date - 2020-03-23T10:02:58+05:30 IST

కరోనా వైరస్‌ నేపథ్యంలో సోమవారం(23న) జరగాల్సిన ఇంటర్‌ మీడియెట్‌ పరీక్షను వాయిదా వేశారు. ఈ నెల 31 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పాటించాలని ప్రభుత్వం నిర్ణయించిన

నేటి ఇంటర్‌ పరీక్ష వాయిదా

గ్రూప్‌-1, లెక్చరర్‌ పరీక్షలు కూడా

అమరావతి, మార్చి 22(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ నేపథ్యంలో సోమవారం(23న) జరగాల్సిన ఇంటర్‌ మీడియెట్‌ పరీక్షను వాయిదా వేశారు. ఈ నెల 31 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పాటించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పరీక్షను వాయిదా వేసినట్టు ఇంటర్‌ బోర్డు సెక్రటరీ వి.రామకృష్ణ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇదిలావుంటే, ఏప్రిల్‌ 7 నుంచి జరగాల్సిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. అదేవిధంగా జూనియర్‌ అసిస్టెంట్స్‌ పోస్టుల భర్తీకి ఈ నెల 30, 31 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను, నాగార్జున వర్సిటీలో నిర్వహించాల్సిన కంప్యూటర్‌ ప్రొఫిషియన్నీ టెస్స్‌ను వాయిదా వేశారు. ఇక, ఏప్రిల్‌ 3, 4 తేదీల్లో జరగాల్సిన డిగ్రీ లెక్చరర్స్‌ పరీక్షలను కూడా వాయిదా వేసినట్టు ఏపీపీఎస్సీ సెక్రటరీ ఆంజనేయులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-03-23T10:02:58+05:30 IST