ఏపీలో 329కి చేరిన పాజిటీవ్‌ల సంఖ్య
ABN , First Publish Date - 2020-04-08T16:10:47+05:30 IST
ఏపీలో కరోనా పాజిటీవ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి.

అమరావతి: ఏపీలో కరోనా పాజిటీవ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. కొత్తగా 15 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో 6, కృష్ణాలో 6, చిత్తూరు జిల్లాలో 3 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య బుధవారం నాటికి 329కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో కర్నూలు జిల్లాలో 74 కేసులతో అత్యధిక స్థానంలో ఉంది. తర్వాత నెల్లూరు జిల్లాలో 49 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 41, కృష్టా జిల్లాలో 35, కడప 28, ప్రకాశం 24, విశాఖ 20, చిత్తూరు జిల్లాల్లో 20 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.