మంత్రి మేనత్తకు పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-06-01T08:22:41+05:30 IST

రాయలసీమకు చెందిన ఓ మంత్రి మేనత్తకు పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

మంత్రి మేనత్తకు పాజిటివ్‌

మరణించిన తర్వాత నిర్ధారణ

అంత్యక్రియలకు హాజరైన నేత

గుట్టుగా కరోనా పరీక్షలు 


అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): రాయలసీమకు చెందిన ఓ మంత్రి మేనత్తకు పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బెంగళూరులో నివాసం ఉంటున్న ఆమె లాక్‌డౌన్‌కు ముందు ధర్మవరం వచ్చి ఆ నేత సో దరుడి ఇంట్లో ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను మూడు రోజుల కిందట ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించింది. శనివారం ఆమె అంత్యక్రియలకు సదరు మంత్రితో పాటు కుటుంబసభ్యులు హాజరయ్యారు. కరోనా పరీక్షల్లో ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అధికారులు హుటాహుటిన వారందరి శాంపిళ్లు తీ సి పరీక్షలకు పంపారు. మృతురాలి భర్తకు, మంత్రి తల్లికి పాజిటివ్‌ రాగా, ఆ నేతకు మాత్రం నెగెటివ్‌ వచ్చింది. 

Updated Date - 2020-06-01T08:22:41+05:30 IST