-
-
Home » Andhra Pradesh » positive cases deaths in AP
-
ఏపీలో కొత్తగా 462 పాజిటివ్ కేసులు.. 8 మంది మృతి
ABN , First Publish Date - 2020-06-23T18:41:09+05:30 IST
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కేసుల ఉధృతి మాత్రం తగ్గట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 462 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కోవిడ్ కారణంగా 8 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య 119 మందికి చేరింది. ఏపీలో స్థానికంగా 407 కరోనా కేసులు నమోదు కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 40 మందికి, విదేశాల నుంచి వచ్చినవారిలో 15 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 9,834కి చేరినట్లుగా హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. ఏపీలో 5,123 యాక్టివ్ కేసులు ఉండగా.. 4,592 మంది డిశ్చార్జ్ అయ్యారు.