రాజకీయ క్వారంటైన్‌ నోటీసులు : విష్ణువర్ధన్‌

ABN , First Publish Date - 2020-04-25T09:27:16+05:30 IST

రాజకీయ కారణాలతోనే నాకు క్వారంటైన్‌ నోటీసులు ఇచ్చారు. నేను ఇంట్లోనే ఉన్నాను. పోలీసు అధికారులు నన్ను సంప్రదించకుండా క్వారంటైన్‌ నోటీసులు గేటుకు అతికించారు

రాజకీయ క్వారంటైన్‌ నోటీసులు : విష్ణువర్ధన్‌

కదిరి, ఏప్రిల్‌ 24: ‘‘రాజకీయ కారణాలతోనే నాకు క్వారంటైన్‌ నోటీసులు ఇచ్చారు. నేను ఇంట్లోనే ఉన్నాను. పోలీసు అధికారులు నన్ను సంప్రదించకుండా క్వారంటైన్‌ నోటీసులు గేటుకు అతికించారు’’ అని నెహ్రూ యువ కేంద్రం (ఎన్‌వైకే) ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం అనంతపురం జిల్లా కదిరిలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తనకు నోటీసులు ఇస్తే ఇటీవల జిల్లాకు వచ్చిన మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి కూడా ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ప్రశ్నించేవారి గొంతు నొక్కటానికే ఇలా వ్యవహరిస్తోందన్నారు. 

Updated Date - 2020-04-25T09:27:16+05:30 IST