రాజకీయ కరోనాతోనే వాయిదా: సీపీఐ
ABN , First Publish Date - 2020-03-16T08:56:23+05:30 IST
స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించడం శుభసూచికమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. మొత్తం ప్రక్రియను మళ్లీ చేపట్టాలని ఈసీని కోరారు.
అమరావతి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించడం శుభసూచికమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. మొత్తం ప్రక్రియను మళ్లీ చేపట్టాలని ఈసీని కోరారు. ఇది రాజకీయ కాలుష్యంతో కూడుకున్న వైరస్ కాబట్టి ఎన్నికలను ఆపాల్సి వచ్చిందన్నారు. కాగా రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా జరిగిన దౌర్జన్యకాండకు సీఎం జగనే బాధ్యత వహించాలని సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.