అచ్చెన్నాయుడును గుంటూరుకు తరలించనున్న పోలీసులు
ABN , First Publish Date - 2020-07-08T23:12:20+05:30 IST
కొద్దిసేపట్లో మాజీమంత్రి అచ్చెన్నాయుడును పోలీసులు గుంటూరు తరలించనున్నారు. ఈఎస్ఐ స్కామ్లో అరెస్టయిన ఆయన విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్నారు.

విజయవాడ: కొద్దిసేపట్లో మాజీమంత్రి అచ్చెన్నాయుడును పోలీసులు గుంటూరు తరలించనున్నారు. ఈఎస్ఐ స్కామ్లో అరెస్టయిన ఆయన విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు అచ్చన్నను గుంటూరులోని రమేష్ ఆసుపత్రికి అధికారులు తరలించనున్నారు. ఇందుకు సంబంధించిన ఆర్డర్ కాపీని అచ్చెన్నాయుడు తరపు న్యాయవాది జైలు సూపరింటెండ్ రఘుకు అందించారు. ఈ నేపథ్యంలో జిల్లా కోర్టు వద్ద పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు.