-
-
Home » Andhra Pradesh » Police special drive on guns
-
నాటు తుపాకులపై పోలీసుల స్పెషల్ డ్రైవ్
ABN , First Publish Date - 2020-06-22T15:09:31+05:30 IST
చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా నాటు తుపాకులపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మదనపల్లి మండలం కోళ్ల బైలు, మాలెపాడు అటవీ ప్రాంతాల్లో..

చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా నాటు తుపాకులపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మదనపల్లి మండలం కోళ్ల బైలు, మాలెపాడు అటవీ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి మొత్తం 21 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. కె.వి పల్లి మండలం జిల్లెల్ల మందా పంచాయతీ పాలెంగడ్డ అటవీ ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో 19 నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో ఇటీవల కాలంలో వన్యప్రాణుల వేట ఎక్కువ కావడంతో పోలీసులు నాటు తుపాకులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ దాడుల్లో నిందితులు ఎవరూ కూడా పట్టు పడలేదు.