నూజివీడులో పోలీసుల హడావుడి

ABN , First Publish Date - 2020-03-13T10:34:34+05:30 IST

కృష్ణాజిల్లా నూజివీడు పురపాలక ఎన్నికల్లో టీడీపీ తరఫున 32వ వార్డు అభ్యర్థిగా పోటీచేస్తున్న పల్లి నాగరాజు వ్యాపార సంస్థలో పోలీసులు సోదాలు చేసి హడావుడి...

నూజివీడులో పోలీసుల హడావుడి

నూజివీడు, మార్చి 12: కృష్ణాజిల్లా నూజివీడు పురపాలక ఎన్నికల్లో టీడీపీ తరఫున 32వ వార్డు అభ్యర్థిగా పోటీచేస్తున్న పల్లి నాగరాజు వ్యాపార సంస్థలో పోలీసులు సోదాలు చేసి హడావుడి సృష్టించారు. ఆయనను అభ్యర్థిగా ఎంపిక చేసిన గంటలోనే ఈ దాడులు జరగడం గమనార్హం. నాగరాజు స్థానిక హరిదుర్గ మణికంఠ ఫైనాన్స్‌ సంస్థ యజమాని. సెకండ్‌ హ్యాండ్‌ బైకులను ఫైనాన్స్‌కు అమ్ముతుంటారు. గురువారం రాత్రి 7.30 సమయంలో ఎస్‌ఐ శ్రీనివాసరావు అక్కడికొచ్చి ‘ఇక్కడ ఉన్నవన్నీ దొంగబళ్లే.. లారీ తీసుకొచ్చి ఎక్కించండి..’ అంటూ హంగామా సృష్టించారు. టీడీపీ ఇన్‌చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తన అనుచరులతో వచ్చి నాగరాజు అభ్యర్థిగా ఎంపికైన గంటలోనే ఫిర్యాదులు అందాయా అంటూ ప్రశ్నించడంతో వాహనాల వివరాలను రేపు అందించాలని చెప్పి ఎస్‌ఐ నిష్క్రమించారు.

Updated Date - 2020-03-13T10:34:34+05:30 IST