-
-
Home » Andhra Pradesh » police officers
-
పోలీసు అధికారుల కేటాయింపులు కొలిక్కి
ABN , First Publish Date - 2020-10-07T10:10:09+05:30 IST
పోలీసు అధికారుల కేటాయింపులు కొలిక్కి

అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల మధ్య ఆరేళ్లుగా నానుతున్న పోలీసు ఉద్యోగుల కేటాయింపునకు ముగింపు పలికారు. రాష్ట్ర విభజన తర్వాత ఎక్కడ పనిచేస్తున్న అధికారులు అక్కడే ఉండిపోయారు. ఏపీలో ప్రస్తుతం పనిచేస్తున్న డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ, నాన్ కేడర్ ఎస్పీ స్థాయి అధికారుల్లో పదిమంది తెలంగాణకు సుముఖంగా ఉన్నారని, అదే విధంగా ఏపీకి వచ్చేందుకు ఏడుగురు రెడీగా ఉన్నారని వెల్లడించారు. మంగళవారం డీజీపీల మధ్య చర్చలతో 17మంది అధికారులకు తాత్కాలిక కేటాయింపులు చేసింది.