కొల్లు రవీంద్రకు పోలీసు నోటీసులు

ABN , First Publish Date - 2020-12-05T10:48:23+05:30 IST

మంత్రి పేర్ని నానిపై తాపీ మేస్ర్తీ జరిపిన దాడి కేసులో విచారణకు హాజరుకావాలని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్రకు ఇనకుదురు సీఐ శ్రీనివాసరావు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. రవీంద్ర ఇంటికి వచ్చిన సీఐ.. విచారణకు రావాలని కోరారు.

కొల్లు రవీంద్రకు పోలీసు నోటీసులు

మచిలీపట్నం టౌన్‌, డిసెంబరు 4: మంత్రి పేర్ని నానిపై తాపీ మేస్ర్తీ జరిపిన దాడి కేసులో విచారణకు హాజరుకావాలని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్రకు ఇనకుదురు సీఐ శ్రీనివాసరావు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. రవీంద్ర ఇంటికి వచ్చిన సీఐ.. విచారణకు రావాలని కోరారు. సీఐతో కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల చర్చించారు. ఈ కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని రవీంద్ర తేల్చి చెప్పారు. డీఎస్పీ రమేశ్‌రెడ్డితో ఫోనులో రవీంద్ర మాట్లాడారు. ఏదైనా నోటీసుఇస్తే వస్తానని చెప్పారు. దీంతో సీఐ నోటీసును తీసుకుని మళ్లీ వచ్చారు. రవీంద్ర ఎండార్స్‌మెంట్‌ రాసి ఇచ్చారు. అయితే, తనకు వ్యక్తిగత పనులున్నాయని, వారం రోజుల్లో విచారణకు వస్తానని చెప్పారు. 

Updated Date - 2020-12-05T10:48:23+05:30 IST