నాగేంద్ర నుండి కీలక విషయాలు రాబడుతున్న పోలీసులు

ABN , First Publish Date - 2020-11-07T01:05:14+05:30 IST

దివ్య హత్య కేసు నిందితుడు నాగేంద్రబాబును దిశ పోలీస్ స్టేషన్‌కి పోలీసులు తీసుకొచ్చారు. నాగేంద్ర నుండి పోలీసులు కీలక విషయాలు రాబడుతున్నట్లు సమాచారం.

నాగేంద్ర నుండి కీలక విషయాలు రాబడుతున్న పోలీసులు

విజయవాడ: దివ్య హత్య కేసు నిందితుడు నాగేంద్రబాబును దిశ పోలీస్ స్టేషన్‌కి పోలీసులు తీసుకొచ్చారు. నాగేంద్ర నుండి పోలీసులు కీలక విషయాలు రాబడుతున్నట్లు సమాచారం. నాగేంద్రను శనివారం ఉదయం కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. దివ్య హత్య కేసులో నిందితుడు నాగేంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ కాగానే నిందితుడిని అరెస్ట్ చేశారు. విజయవాడ దిశ పీఎస్‌లో నాగేంద్రను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.


జీజీహెచ్‌లో గత నెల 15 నుంచి నాగేంద్రబాబు చికిత్స పొందుతున్నాడు. నాగేంద్రబాబు కోలుకుకోవడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ అనంతరం నిందితుడిని పోలీసులు విజయవాడకు తరలించారు. నాగేంద్రబాబుని పోలీసులు తీసుకుని విచారిస్తున్నారు. గత నెలలో దివ్య తేజస్విని దారుణంగా హత్య చేసిన నాగేంద్రబాబు ఆపై తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. దాదాపు 22 రోజుల పాటు నాగేంద్రబాబు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందాడు. 

Updated Date - 2020-11-07T01:05:14+05:30 IST