వైసీపీ ఎమ్మెల్యే గోడౌన్‌లో పోలీసుల తనిఖీలు

ABN , First Publish Date - 2020-07-19T21:48:07+05:30 IST

వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా గౌస్ పొగాకు గోడౌన్‌లో అక్రమ గుట్కా తయారవుతోందని..

వైసీపీ ఎమ్మెల్యే గోడౌన్‌లో పోలీసుల తనిఖీలు

గుంటూరు: వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా గౌస్ పొగాకు గోడౌన్‌లో అక్రమ గుట్కా తయారవుతోందని అర్బన్ పోలీసులు గుర్తించారు. దీంతో ఆదివారం గొడౌన్లలో తనిఖీలకు నేరుగా ఎస్పీ అమ్మిరెడ్డి వెళ్లారు. గుట్కా తయారీ సామాగ్రి, ప్యాకెట్లను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. 


పెదకాకానీ మండలం, కొప్పురావూరు సమీపంలో ఉన్న ఎమ్మెల్యే గోడౌన్‌లో గత కొంత కాలంగా అక్రమంగా గుట్కా తయారీ జరుగుతోంది. ఎస్పీ అమ్మిరెడ్డికి వచ్చిన విశ్వాసనీయ సమాచారం మేరకు స్పెషల్ టీమ్ గోడౌన్‌లో సోదాలు జరిపింది. సుమారు కోటి రూపాయల గుట్కా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అయితే పాన్ మాసాలా తయారు చేయడం కోసం సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి పేరుతో అనుమతులు తీసుకుని గోడౌన్‌లో నడుపుతున్నారు. కాగా పాన్ మాసాలాతోపాటు టెంపర్ పేరుతో గుట్కాను తయారు చేసి ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు.

Updated Date - 2020-07-19T21:48:07+05:30 IST