పోలీసులంటే ఇలా కూడా ఉంటారా?...

ABN , First Publish Date - 2020-04-25T14:15:03+05:30 IST

పోలీసులంటే ఇలా కూడా ఉంటారా?...

పోలీసులంటే ఇలా కూడా ఉంటారా?...

ప్రకాశం: జిల్లాలో పంగులూరు మండలం రేణింగవరం పోలీసు స్టేషన్ సిబ్బంది రహదారిపై వెళ్లే వాహన డ్రైవర్ల ఆకలి తీర్చారు. లాక్‌డౌన్ కారణంగా రహదారి ఇరువైపులా ఉన్న హోటళ్లు అన్నీ మూసివేయడంతో ఆకలితో మలమలమాడే డ్రైవర్లకు కాస్త అన్నం పెడుతున్నారు. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న పలు వాహనాల డ్రైవర్లు ఇబ్బందులకు గురవుతున్నారు. వారి ఆకలి తీర్చేందుకు రేణింగవరం ఎస్సై శ్రీనివాసరావు ఆహార ప్యాకెట్లు అందజేశారు. పోలీసులంటే వాహనాలను ఆపి ఆడించేవారు కాదు...అవసరమైతే అన్నంపెట్టి, ఆదకునేవారని ఈ ఘటన రుజువు చేసింది.

Updated Date - 2020-04-25T14:15:03+05:30 IST